" 'గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః'
ఈ పదాలకు అర్ధం ఏమో గాని
గురువంటే తెలుసు దైవసమానులని.
వారు జన్మనిచ్చిన తల్లి దండ్రులైతే
మీరు జ్ఞానమిచ్చిన తల్లి దండ్రులు
కానరాని దైవలకు ప్రతిరూపాలు
అజ్ఞాన చీకటిలో వెలుగు దీపాలు
చరిత్ర చెబుతుంది మీ శక్తి కధనాలు
పవిత్ర కర్తవ్యం పట్టిన వ్యక్తికి వందనాలు.
ఏమి ఇస్తే కలుగుతుంది నాకు పుణ్యము?
ఏమి చేస్తే తీరుతుంది ఆ ఋణము?
ఎందరో మహానుభావులను తీర్చి దిద్దిన చాతుర్యం మీది
ఆ స్థానంలో ఉన్న మీకు గౌరవించే అదృష్టం నాది.
అదే నా బాధ్యతగా భావించి
మీ రోజున అందిస్తున్న నా నమస్సుమాంజలి."
అని
ఏ విద్యార్ధిలొ ఉంది ఇంత భావము
ఉపాధ్యాయుడంటేనే వాళ్ళకు కండకావరము
లేదు లేదు గౌరవము అనువంతనూ
పొగరెక్కి ఉంది వాళ్ళ తనువంతనూ
"వారు, ఆమె " అనే గౌరవ సంబోధనలు మాని
"వాడు, అది " అనే అపశ్రుతులు పలుకుతుంది నేటి విద్యార్ధి లోకం.
విద్య ముగిసాక గుర్తించాల్సిన మిమ్ము
మీరే మమ్ము గుర్తించాల్సిన దరిద్ర స్థితి నేడు.
ఇంత దుస్థితికి దిగాజరినందుకు సిగ్గుపడనా?
గురువుని గౌరవించని సమాజంలో విద్యర్దినైనందుకు చింతించనా ?
భవిష్యత్తుని తొంగి చూస్తేనే భయమేస్తుంది
రాబోవు తరాలు విద్యార్ధులను తలచుకుంటేనే వణుకొస్తుంది
దయవుంచి చూపొద్దు మీరు కూడా ఏ బేధాలు
అవి ప్రధానమై మారి తెస్తున్నాయి ఈ భావనలు.
నిష్కల్మషంగా నిర్వహించండి మీ గురు కార్యము
లేకుంటే కావచ్చు ఈ పాటి గుర్తింపు కూడా శూన్యము
ఇదే నేటి మీ విద్యార్ధిగా ఒక విన్నపము
ఈనాటి నా విద్యార్ధి లోకంపై నాకున్న సద్భావము.
Saturday, September 4, 2010
Subscribe to:
Posts (Atom)