Thursday, July 15, 2010

నా నీలి మేఘమా!

క్షణ క్షణం నన్ను కవ్వించి మరిపించే నా ప్రియ శ్యామమా!
నను వీడిపోతానని విడిచి ఉండలేని నా నీలి మేఘమా!
నేను మాత్రం నిన్ను విడిచి ఉండగలనా ప్రాణమా?
నిగ్రహం నిలవలేని మన అనుబంధంలో
విరహం వచ్చి వేదిస్తున్నది,
దూరం అయ్యే కొద్దీ నీకు మరింత
దగ్గరయ్యేలా నను తరుముతున్నది.
ఇది స్నేహమో లేక ప్రణయమో తెలియని
సంఘర్షణను మిగుల్చుతున్నది.

1 comment:

  1. గురువు గారు గురువుగారే..
    ఏకలవ్య శిష్యరికం ఇక్కడ కూడా వర్తిస్తోంది మాకు..
    బొటనవేళ్ళు భద్రం.. ;)

    ReplyDelete

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం