Monday, July 19, 2010

ఎవరిదీ ప్రకృతి?



      ఎవరిదీ ప్రకృతి? నీదా? నాదా?

             సహజ సిద్ద అందాలను అద్దిన ఈ సృష్టిదా?
             నవ జీవన ఆయువుపట్టు దాచుకుని అంతరిస్తున్న కాలానిదా?
             జీవ వాయువును  దోచుకుని అంతం చేస్తున్న జనానిదా?
             సూక్ష్మ జాతులదా? కీటక ప్రాణులదా?
             లేక వాటిపై ఆధారపడి బ్రతికే పశు వృక్షాలదా?

      ఎవరిదీ? ఎవరిదీ ప్రకృతి?

             నోళ్ళు తెరచి నిప్పులు కక్కి కాల్చే అగ్ని పర్వతాలదా?
             వినాశనానికొడిగట్టి కన్నీళ్ళు కార్చే జడివానదా?
             పొంగి పొరిలి జల విలయం సృష్టించే ప్రలయానిదా?
             భూ భారం భరించలేక బాధతో పెకలించే ప్రకంపనలదా?
             సుడిగుండానిదా? వాయు వేఘానిదా?
             లేక కారు మబ్బులు కమ్మి పిడుగుపాటు దెబ్బలు కొట్టే నీలి మేఘానిదా?

      ఎవరిదీ? ఎవరిదీ ప్రకృతి?

             అణగదొక్కి ఎదుగుతున్న అగ్రరాజ్య ఆధిపత్యానిదా?
             ధీటుగా డీకొనాలని పరితపిస్తున్న చిన్నరాజ్యాల అభివృద్ధిదా?
             కూటికై నిరీక్షించి కరిగిన కన్నీటిని తాగే పేదరికానిదా?
             అలమటిస్తున్న కడుపులు మండి కబళించే ఆకలి కేకలదా?
             ఆధునిక కాలానిదా? నాగరికత నైజానిదా?
             లేక, అంతరించిపోతున్న జీవ జాతులలో తన స్థానం మరచి
             ముంచుకొస్తున్న వైపరిత్యాలను విష్మరించి
             సర్వ సృష్టిని శాసించాలన్న వ్యామోహంలో ఉన్న స్వార్ధ మానవుడిదా? 

      ఎవరిదీ ప్రకృతి?
      ఏమో! తరిగిపోతున్న మనుగడ కోసం కరిగిపోతున్న కాలమే నిర్ణయించాలి.

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం