Friday, July 16, 2010

పిచ్చి మాటలు

పిచ్చివాడిని నేనొక పిచ్చివాడిని!
ఆశయాల ఒడిలో శెయనిస్తున్న వెర్రివాడిని! 
విజ్ఞాన వెలుతురులో నీతి భాటన పయనించిన అజ్ఞానిని,
న్యాయ సమాజానికై వెతికి అన్యాయమైపోయిన భాటసారిని.
 అధికార పాశాల ఆధిపత్యానికి బలైన బడుగు జీవిని,
అధర్మం అడ్డుగోడలకు ఆగిపోయిన బలహీనుడిని.
మంచితనమే మార్గం చుపునని నమ్మిన 
మంచివాడిని, నేనొక పిచ్చివాడిని!
ఆశయాల ఒడిలో శెయనిస్తున్న వెర్రివాడిని!
 
ఆవేశాలతొ ఉడికిన రక్తం చల్లారి సేదదీరుతున్నది,
ఆదర్శాలకై చిందిన స్వేదం అలసిపోయి ఆవిరైనది.
రాసిన నుదుటి రాతలు గజిబిజి గీతలైనాయి,
వేసిన భవిష్య ప్రణాళికలు చెరిగి శూన్యమైనాయి.
కల్లుండి దారి తెలియని అందుడినైతిని,
నోరుండి మాటరాని మూగావాడినైతిని.
 ఏదో సాధించాలనుకున్న పిచ్చివాడిని!
ఏదీ సాధించలేకపోయిన వెర్రివాడిని!
 
హేళన చేసి నా నవ్వు విరగబడి నవ్వుతున్నది,
పీకుడెరుగని  నోరు నిర్విరామంగా ఏదో పలుకుతుంటది.
వాటి భావం గ్రహించని జనం మధ్య నేనెందుకు?
ఒక దారిని చూపలేని ఈ పిచ్చి లోకం నాకెందుకు?
ఎవరితోనూ పని లేదు,
యోచించాల్సిన అవసరమూ లేదు.
నేనొక స్వతంత్ర జీవిని, నేనొక పిచ్చివాడిని!
ఆశయాల ఒడిలో శెయనిస్తున్న వెర్రివాడిని!

నాకు ఎదురే లేదు, ఇంకెవరూ  అడ్డుకాదు. 
క్షణం కూడా మనశ్శాంతి కరువైన ఈ లోకంలో,
ఎంతో ప్రశాంతంగా ఉన్న నా నవ ప్రపంచం చూడు!
నెల రాలిన పర్ణాలు వేల విలువ చేస్తాయి,
నిశబ్ధమే ధ్యేయంగా గులక రాళ్ళు నా చేతికి చిక్కుతాయి.
చిరు గాలికి ఎగురుతూ చిత్తు కాగితం నా ఒడికి చేరుతుంది,
చిరిగిన వస్త్రం, అరిగిన చెప్పు నన్ను వరించి హత్తుకుంటాయి.
ఇంత సంపద నా చెంత ఉండగ పక్కవాడితో పనేముంది?
యోచించాల్సిన అవసరం ఏముంది?

ఈ పిచ్చిలోకం నాకు పిచ్చంటుంది,
నా మాటలు గట్టి మాటలు కావు,
వట్టి మాటలు కానే కావు, కేవలం పిచ్చి మాటలంటుంది.
అవును! ఈ పిచ్చి జనాలకు నేనొక పిచ్చివాడిని,
ఆశయాల ఒడిలో శెయనిస్తున్న వెర్రివాడిని.

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం