అమృత స్నేహానుబంధమా!
నా పట్ల నీపై నీకున్న నమ్మకానికి కృతజ్ఞుడను.
అంతకన్నా ముందు మన స్నేహాన్ని నమ్మవా?
ఆ ప్రియ బంధాన్ని ప్రేమించే నన్ను అర్ధం చేసుకోలేవా?
మాట పట్టింపు విడవద్దని మనస్సాక్షి శాసించింది,
నీ మాట వినలేదని అంతరాత్మ దూషించింది.
తప్పు చేసానన్న భావన వెంటాడి దుయ్యబడుతుంది,
బాధ పెట్టానన్న వేదన వేటాడి హింసిస్తుంది.
దేన్నీ పట్టించుకోని మనసు నాపై మండిపడుతుంది,
స్పర్శలన్నీ ఎడబాటున ఉండి నరకయాతనా పెడుతున్నవి.
ఏం! ఆ శాసనం నీదే ఐతే పాటించక పోదునా?
ఒక్క మాట గట్టిగా చెప్పి ఉంటె కాదందున?
ఇప్పుడు నీతో మాటాడమంటే నాలుక నొచ్చుకుంటుంది,
నిన్ను చుడాలని ఉన్నా, కనురెప్పలు సహకరించక కప్పుకుపోతున్నాయి.
ఎదురుగ నిలవటానికి కాళ్ళు అదిరిపోతున్నాయి,
నీ వద్ద అర్హత కోలుపోయానని మది చెదిరి బెదిరిపోతుంది.
నీ స్నేహానికి దూరమవుతానేమో అని భయమేస్తుంది.
నిన్ను గాయపరిచానన్న వేదన భారమైంది.
నా ముఖం చూపటానికి సిగ్గుపడుతున్నాను,
పరిస్థితి అర్ధం చేసుకుని మాట మన్నించమని వేడుకుంటున్నాను.
నీ నమ్మకం వమ్ము చేసి బాధ పెట్టినందుకు క్షమించమంటున్నాను.
ప్రాణమైన స్నేహమా, నన్ను క్షమించమ్మా!
No comments:
Post a Comment