Thursday, July 29, 2010

కరగని మనసు

స్నేహానికి అర్ధమైన బంధమా,
శ్రావ్యానుభూతులను చిలికి పలికించే సుధ మధురమ!
వింటివా ఎద పాడె మౌన రాగాలు?
మది పలికే మూగ భావాలు?

నేను దాచుకున్న నీ జ్ఞాపకాలపై మోహాన్ని పెంచుకుంది,
లోతెరుగని బంధాన్ని పంచిన నీ స్నేహాన్ని దోచుకుంది.
అడిగితే తిరిగి ఇవ్వనంటుంది,
నీ వద్దకు పొమ్మంటుంది.

కన్నీళ్లు వెళ్లి కరిగి మొరపెట్టుకున్నా అది కరగలేదు,
ఒప్పిస్తానని వెళ్ళిన స్పర్శ, దాని కవ్వింతకు లొంగి తిరిగి రాలేదు.
వేచి చూస్తున్న ఆశలు నా మనసుతో స్వరాలు పలుకుతున్నాయి,
గుండె సవ్వళ్ళు సైతం వాటితో శృతి కలుపుతున్నాయి.

నాకు సొంతమైన అమృతాన్ని అది సేవిస్తుంటే,
ఈర్ష్య వచ్చి ఓదార్చుతుంది.
విరహ వేదనలో నీకై పయనిస్తుంటే,
కావ్య భావాలు పెంచుతుంది.
వాటిని కూర్చి నవ్య రూపం చేర్చి చూస్తె తెలిసింది,
అది నీ స్నేహాన్ని ప్రేమిస్తుందని!

అందుకే కష్టమైనా ఇష్టంగా ఆ నష్టాన్ని భరించి జీర్నించుకున్నాను,
ఎద నుండి వెలువడే అలజడులను ఇలా వర్ణించుకున్నాను.

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం