Saturday, July 17, 2010

ప్రణయ ఘోష

ఇది కలయా లేక నిజామా!
ఎదురు పడితే ఎరుపెక్కే కళ్ళు,
నేడు నాకై రొధిస్తూ కరిగిపోతున్నాయి.
నా  పిలుపే పట్టించుకోని చెవులు,
నా పలుకుకై తెరలు తెరుచుకున్నాయి.
అనుక్షణం జ్వలించె అదరాలు,
నాపై వాలి హిమమైనాయి.
నా చెంపలను ఛల్లుమనిపించాలనుకున్న చేతులు,
నేడు వాటినే చెంతకు చేర్చుకున్నాయి.
బండలా ఉండే గుండె, మెత్తని మనసైంది,
నేను ఆశించిన స్పర్శ వచ్చి నా శ్వాసను ఆశిస్తుంది.
నా ధ్యాసను కూడా ధరికి రానివ్వని మది,
దాని ఎదనిండా ఇప్పుడు నన్నే నింపుకుంది.
ఇప్పుడే పరిమళించిన మధురామృత భావాలు,
ప్రణయ ఘోషలో చేరి స్పర్శతో నన్ను హత్తుకున్నాయి,
చెలి చూపుల భయంతో వణికే నాకు,
వెచ్చని కౌగిలిలో వాలె అపురూప అవకాశాన్ని కలిగించాయి.

ఈ జన్మకు వినననుకున్న మూడు మాటలు ఆ నోట విన్నాక,
 బిగిసిన నరాలు వీనలై నవీన అలజడులు రేపిన అనుభూతిలొ
స్వరాలు పలికిస్తుంటే,
ఇదేమి చిత్రమో!............

వాటితో శృతి కలపాల్సిన నా గుండె చప్పుడు,
సుధీర్ఘ విశ్రాంతి తీసుకుంటుంది.
ఇన్నేళ్ళూ చలనం లేని చెలిని చూసి,
చెదిరిన నా మనసు శూన్యమైపోయింది.
కానరాని వాయువులో కలిసి,
తిరిగి రాని విహరాలకై ఆయువు ఎగసిపోయింది.
చూడాలని ఉన్నా, కను రెప్పలు బరువెక్కిపోతున్నాయి,
భావాలను పంచుకోవాలని ఉన్నా, అవి చేదిరిపోతున్నాయి.
కానీ నీ ప్రేమ మాత్రం నన్ను చేరుతుంది,
నువు స్పంధించిన స్పర్శ నన్ను తాకుతుంది.
ఇది కలయా? నిజామా?
రెప్ప తెరిస్తే ఉంటావో లేదో!
పలకరిస్తే కసురుకుంటావో ఏమో!
అందుకే దీర్ఘాందకారంలో నిద్రిస్తున్నా,
నీ రెప్పల మాటున వెలుగుతున్నా.
ప్రియ! నేను కనుమూస్తే గాని స్పంధించని
నీ మనసుకై ఎన్ని జన్మలైనా ఎత్తి కన్నుమూస్తా..........

No comments:

Post a Comment

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం