Tuesday, July 20, 2010

ప్రశ్నార్ధకం!!

లేపినదెవరు? వెన్ను తట్టి లేపినదెవరు?
విక్రాంతమైన మదిలో చలనం నింపినదెవరు?
మండుతున్న ఎండమావిలో తొలకరులు కురిపించినదెవరు?
ఆవిరవుతున్న ఆశలకు ఆశ చూపినదెవరు?
మోడుబారిన మొక్కకు నీరు పోసినదెవరు?
నిగ్రహం నడిపిస్తున్న వేళ విరహం విరబూయించినదెవరు?
నీకు తెలియదు కదా!
ఐతే నేను నీతో గడిపిన క్షణాలను అడుగు చెబుతాయి.

వ్యక్తపరచని భావాలను గ్రహించినదెవరు?
తెంచుకున్న అనుభవాలను పంచుకున్నదెవరు?
ఏకాంతం కోరుకున్న ఏకాకికి కొలువైనదెవరు?
వైరాగి అయిన వాడికి వైడూర్యమై దొరికినదెవరు?
ఇంకిపోయిన కళ్ళల్లో చెమ్మ చేర్చినదెవరు?
చెదిరిన అదరాలపై దరహాసపూరెకలు పూయించినదెవరు?
నీకు తెలియదు కదా!
ఐతే నువ్వు నాతొ గడిపిన క్షణాలను అడుగు చెబుతాయి.

వలదని వదిలేసిన స్పర్శను చేతికి అందించినదెవరు?
స్నేహమన్న బంధాన్ని మళ్ళీ రుచిచూపినదెవరు?
నేస్తమై పక్కన నడిచినదెవరు?
కలిసికట్టుగ చేయిపట్టి ముందుకు నడిపించినదెవరు?
మరచిన అనుభూతులను గుర్తు చేసినదెవరు?
గాయపడిన గుండెకు వెన్న పూసి నయం చేసినదెవరు?
నీకు తెలియదు కదా!
ఐతే మనం కలిసి గడిపిన క్షణాలను అడుగు చెబుతాయి.

రావనుకున్న కన్నీళ్ళు నువు దూరమవుతుంటే  వచ్చాయి,
నాలుకపైకి చేరి అందులో మాధుర్యాన్ని పంచాయి.
మల్లీ ఒంటరినవుతున్నానన్న వేదనతో గుండె బరువెక్కింది,
ఆవేదనతో లోలోపలే రోదించింది. 
పరిణతి  చెందినా నేను ఎందుకలా స్పంధించాను?
నీకు తెలియదు కదా!
ఏమో రా మరి! ఎందుకో  నాకూ తెలియదు.
అదే ప్రశ్నార్ధకం!!


Dedicated to my dearest BEST FRIEND MUKKU....

2 comments:

  1. chala chala bagumdi nice one.... nd mee lines using kuDa superb.....

    ReplyDelete
  2. supar ga undhi xllent naku chala chala nachindhi

    ReplyDelete

కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం