వీధి బాలలం మేం వీధి బాలలం
భరత మాత కన్న భావి పౌరులం
మల్లెపూల మనసుగల మంచి మనుషులం
విసిరిగొట్టిన సమాజంలో చెదురుతున్న చిరునవ్వులం
మురికి గుడ్డలు ధరించిన సైనికులం
బతుకు బండి నడిపేందుకు పోరాడుతున్న యోధులం
వీధి బాలలం మేం వీధి బాలలం
విధి వంచనకు తల వంచిన విధి బాలలం
కన్న వాళ్ళు లేని అనాధులం
ఉన్నా చేరదీయని అభాగ్యులం
కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న పసి పిల్లలం
బతుకు భారం మోస్తూ చితికిపోతున్న పని పిల్లలం
వీధి బాలలం మేం వీధి బాలలం
మురికి కాల్వల నిలయమున్న మొండి బాలలం
తెల్లకాగితపు రాతలు తెలియని అనామకులం
చిత్తు కాగితాలు చేత పట్టిన శ్రామికులం
బడి ఒడి చేరని చిన్నారులం
మెతుకు వెతుకులాట మధ్య నలుగుతున్న భాటసారులం
వీధి బాలలం మేం వీధి బాలలం
విద్య విలువ తెలియని వెర్రి బాలలం
గమ్యం ఎరుగని జీవన యాణికులం
పూట గడవాలని యోచించే యాచకులం
ఆకలి కేకలు చల్లార్చుకునే చిన్న పిల్లలం
రేపటి రాకకై ఆశించని అమాయకులం
వీధి బాలలం మేం వీధి బాలలం
పొట్టను చేత పట్టి ఒకటైన కుటింబీకులం
భరత మాత వీధిలో నిదురిస్తున్న వీధి బాలలం
మేమే ఆ భావి పౌరులం.
భరత మాత కన్న భావి పౌరులం
మల్లెపూల మనసుగల మంచి మనుషులం
విసిరిగొట్టిన సమాజంలో చెదురుతున్న చిరునవ్వులం
మురికి గుడ్డలు ధరించిన సైనికులం
బతుకు బండి నడిపేందుకు పోరాడుతున్న యోధులం
వీధి బాలలం మేం వీధి బాలలం
విధి వంచనకు తల వంచిన విధి బాలలం
కన్న వాళ్ళు లేని అనాధులం
ఉన్నా చేరదీయని అభాగ్యులం
కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న పసి పిల్లలం
బతుకు భారం మోస్తూ చితికిపోతున్న పని పిల్లలం
వీధి బాలలం మేం వీధి బాలలం
మురికి కాల్వల నిలయమున్న మొండి బాలలం
తెల్లకాగితపు రాతలు తెలియని అనామకులం
చిత్తు కాగితాలు చేత పట్టిన శ్రామికులం
బడి ఒడి చేరని చిన్నారులం
మెతుకు వెతుకులాట మధ్య నలుగుతున్న భాటసారులం
వీధి బాలలం మేం వీధి బాలలం
విద్య విలువ తెలియని వెర్రి బాలలం
గమ్యం ఎరుగని జీవన యాణికులం
పూట గడవాలని యోచించే యాచకులం
ఆకలి కేకలు చల్లార్చుకునే చిన్న పిల్లలం
రేపటి రాకకై ఆశించని అమాయకులం
వీధి బాలలం మేం వీధి బాలలం
పొట్టను చేత పట్టి ఒకటైన కుటింబీకులం
భరత మాత వీధిలో నిదురిస్తున్న వీధి బాలలం
మేమే ఆ భావి పౌరులం.
No comments:
Post a Comment