నిశబ్ధంగా ఉన్న నా హృదయ
శృతి లయ శబ్దాలు
దశాబ్ధ కాలం తరువాత నీకై
గొంతు చించుకుని అరిచాయి
నా గుండె పొరలు చీల్చుకుని
నీ గుండె గూటికి చేరాలని
రెక్కలు విచ్చుకుని ఎగిసాయి
కట్టలు తెంచుకున్న ప్రణయం
ప్రళయమై ఉప్పొంగి నీకు
తెలియజేయాలని నా భావాలను ముంచుకొస్తుంటె
ప్రణయ హస్తమై నీలో కలుపుకుంటావో
ప్రాణ నేస్తమై నాతో కలిసి ఉంటావో
నీ ఇష్టం ప్రాణ నేస్తమా!
Tuesday, November 9, 2010
Saturday, September 4, 2010
గురు భక్తి
" 'గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః'
ఈ పదాలకు అర్ధం ఏమో గాని
గురువంటే తెలుసు దైవసమానులని.
వారు జన్మనిచ్చిన తల్లి దండ్రులైతే
మీరు జ్ఞానమిచ్చిన తల్లి దండ్రులు
కానరాని దైవలకు ప్రతిరూపాలు
అజ్ఞాన చీకటిలో వెలుగు దీపాలు
చరిత్ర చెబుతుంది మీ శక్తి కధనాలు
పవిత్ర కర్తవ్యం పట్టిన వ్యక్తికి వందనాలు.
ఏమి ఇస్తే కలుగుతుంది నాకు పుణ్యము?
ఏమి చేస్తే తీరుతుంది ఆ ఋణము?
ఎందరో మహానుభావులను తీర్చి దిద్దిన చాతుర్యం మీది
ఆ స్థానంలో ఉన్న మీకు గౌరవించే అదృష్టం నాది.
అదే నా బాధ్యతగా భావించి
మీ రోజున అందిస్తున్న నా నమస్సుమాంజలి."
అని
ఏ విద్యార్ధిలొ ఉంది ఇంత భావము
ఉపాధ్యాయుడంటేనే వాళ్ళకు కండకావరము
లేదు లేదు గౌరవము అనువంతనూ
పొగరెక్కి ఉంది వాళ్ళ తనువంతనూ
"వారు, ఆమె " అనే గౌరవ సంబోధనలు మాని
"వాడు, అది " అనే అపశ్రుతులు పలుకుతుంది నేటి విద్యార్ధి లోకం.
విద్య ముగిసాక గుర్తించాల్సిన మిమ్ము
మీరే మమ్ము గుర్తించాల్సిన దరిద్ర స్థితి నేడు.
ఇంత దుస్థితికి దిగాజరినందుకు సిగ్గుపడనా?
గురువుని గౌరవించని సమాజంలో విద్యర్దినైనందుకు చింతించనా ?
భవిష్యత్తుని తొంగి చూస్తేనే భయమేస్తుంది
రాబోవు తరాలు విద్యార్ధులను తలచుకుంటేనే వణుకొస్తుంది
దయవుంచి చూపొద్దు మీరు కూడా ఏ బేధాలు
అవి ప్రధానమై మారి తెస్తున్నాయి ఈ భావనలు.
నిష్కల్మషంగా నిర్వహించండి మీ గురు కార్యము
లేకుంటే కావచ్చు ఈ పాటి గుర్తింపు కూడా శూన్యము
ఇదే నేటి మీ విద్యార్ధిగా ఒక విన్నపము
ఈనాటి నా విద్యార్ధి లోకంపై నాకున్న సద్భావము.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః'
ఈ పదాలకు అర్ధం ఏమో గాని
గురువంటే తెలుసు దైవసమానులని.
వారు జన్మనిచ్చిన తల్లి దండ్రులైతే
మీరు జ్ఞానమిచ్చిన తల్లి దండ్రులు
కానరాని దైవలకు ప్రతిరూపాలు
అజ్ఞాన చీకటిలో వెలుగు దీపాలు
చరిత్ర చెబుతుంది మీ శక్తి కధనాలు
పవిత్ర కర్తవ్యం పట్టిన వ్యక్తికి వందనాలు.
ఏమి ఇస్తే కలుగుతుంది నాకు పుణ్యము?
ఏమి చేస్తే తీరుతుంది ఆ ఋణము?
ఎందరో మహానుభావులను తీర్చి దిద్దిన చాతుర్యం మీది
ఆ స్థానంలో ఉన్న మీకు గౌరవించే అదృష్టం నాది.
అదే నా బాధ్యతగా భావించి
మీ రోజున అందిస్తున్న నా నమస్సుమాంజలి."
అని
ఏ విద్యార్ధిలొ ఉంది ఇంత భావము
ఉపాధ్యాయుడంటేనే వాళ్ళకు కండకావరము
లేదు లేదు గౌరవము అనువంతనూ
పొగరెక్కి ఉంది వాళ్ళ తనువంతనూ
"వారు, ఆమె " అనే గౌరవ సంబోధనలు మాని
"వాడు, అది " అనే అపశ్రుతులు పలుకుతుంది నేటి విద్యార్ధి లోకం.
విద్య ముగిసాక గుర్తించాల్సిన మిమ్ము
మీరే మమ్ము గుర్తించాల్సిన దరిద్ర స్థితి నేడు.
ఇంత దుస్థితికి దిగాజరినందుకు సిగ్గుపడనా?
గురువుని గౌరవించని సమాజంలో విద్యర్దినైనందుకు చింతించనా ?
భవిష్యత్తుని తొంగి చూస్తేనే భయమేస్తుంది
రాబోవు తరాలు విద్యార్ధులను తలచుకుంటేనే వణుకొస్తుంది
దయవుంచి చూపొద్దు మీరు కూడా ఏ బేధాలు
అవి ప్రధానమై మారి తెస్తున్నాయి ఈ భావనలు.
నిష్కల్మషంగా నిర్వహించండి మీ గురు కార్యము
లేకుంటే కావచ్చు ఈ పాటి గుర్తింపు కూడా శూన్యము
ఇదే నేటి మీ విద్యార్ధిగా ఒక విన్నపము
ఈనాటి నా విద్యార్ధి లోకంపై నాకున్న సద్భావము.
Sunday, August 22, 2010
మంచి ముత్యం 2
కాళ్ళు ఎప్పుడూ నేల మీదే ఉండాలి
కళ్ళు ఎప్పుడూ వాటినే చూడాలి
జయం వహిస్తే తొనకరాదు
అపజయం ఆవహిస్తే వనకరాదు
అవి అసాస్వతం
నువు ఎంత వాడివైననూ
అణిగి ఉంటె నిన్ను అనిచేవాడెవడు?
కళ్ళు ఎప్పుడూ వాటినే చూడాలి
జయం వహిస్తే తొనకరాదు
అపజయం ఆవహిస్తే వనకరాదు
అవి అసాస్వతం
నువు ఎంత వాడివైననూ
అణిగి ఉంటె నిన్ను అనిచేవాడెవడు?
మంచి ముత్యం
కుమ్మరి చేతికి చిక్కాల్సిన మట్టి ముద్ద
చాకలి చేతికి చిక్కితే వట్టి బురదే
అవును గాని మట్టి పిడతగా మారునా?
కంసాలికివ్వాల్సిన రత్నాన్ని పిచ్చివాడికిస్తే
అది గులకరాయిగా దోర్లునుగాని
వజ్రమై పుత్తడి పొత్తిలో పొదిగి ఉండునా?
మరి నువు ఎవరి చేతికి చిక్కావ్?
చాకలి చేతికి చిక్కితే వట్టి బురదే
అవును గాని మట్టి పిడతగా మారునా?
కంసాలికివ్వాల్సిన రత్నాన్ని పిచ్చివాడికిస్తే
అది గులకరాయిగా దోర్లునుగాని
వజ్రమై పుత్తడి పొత్తిలో పొదిగి ఉండునా?
మరి నువు ఎవరి చేతికి చిక్కావ్?
ఇటు మూడు - అటు ఆరు
మనదనుకున్న మనది మనతో వచ్చునా?
వలదనుకున్నది వచ్చి తీసుకుపొవటం మరచునా?
మనది కాదనుకున్న మన్నేగా చివరికి మనమయ్యేది!
మరి ఎందుకు ఈ జీవన గమనంలో స్వార్ధ ప్రయాసలకై జపించటం?
క్షణకాలంలో క్షయించే ఉదానమును అవి పెంచగలవా
లేక సమీపించే తుది గడియలను మన నుంచి తుంచగలవా
ఎవరికైనా చివరకు మిగిలేది
......"ఇటు మూడు - అటు ఆరే కదా!"
వలదనుకున్నది వచ్చి తీసుకుపొవటం మరచునా?
మనది కాదనుకున్న మన్నేగా చివరికి మనమయ్యేది!
మరి ఎందుకు ఈ జీవన గమనంలో స్వార్ధ ప్రయాసలకై జపించటం?
క్షణకాలంలో క్షయించే ఉదానమును అవి పెంచగలవా
లేక సమీపించే తుది గడియలను మన నుంచి తుంచగలవా
ఎవరికైనా చివరకు మిగిలేది
......"ఇటు మూడు - అటు ఆరే కదా!"
ఇష్టం
నా ఇష్టాన్ని
తన ఇష్టానికి
కష్టమైనా
ఇష్టంగా నష్టపోయి
తన ఇష్టాన్ని
స్పష్టంగా ఇష్టపడి
బ్రతకడంలొ ఉండే
మధుర భావమంటే
నాకెంతో ఇష్టం.
తన ఇష్టానికి
కష్టమైనా
ఇష్టంగా నష్టపోయి
తన ఇష్టాన్ని
స్పష్టంగా ఇష్టపడి
బ్రతకడంలొ ఉండే
మధుర భావమంటే
నాకెంతో ఇష్టం.
Friday, August 13, 2010
దూరం
దూరమన్న మాట దూరాన ఉన్నపుడు
దానికి నేనెంతో దూరమని భావించాను
కానీ నువు కాస్త దూరానికి దగ్గర కాగానే
ఆ దూరం కాస్త నాకు దగ్గరయ్యి
నీ స్నేహాన్ని ఇంకా దగ్గర చేసింది.
దూరానికి దగ్గరైతే అది ఎన్నో
దూరాలను దగ్గరకు చేర్చుతుందని
నువు దూరమైతే గాని
అ అనుభవం నాకు దగ్గరకాలేదు.
ఎక్కడో ఉండే దూరం
ఇంత దగ్గరే ఉంటుందని
ఒక మధుర భావాన్ని పంచుతుందని
ఎన్నడూ అంత దూరం ఆలోచించలేదు నేస్తమా!
బెదిరిన భావాలు
లొడలొడ వాగే నా నోట పదాలు కరువయ్యాయి
మదిని హాయిగొలిపే ఈ పూట భావాలు దూరమయ్యాయి
జలజల రాల్చే నా కలానికీ అక్షరాలు చిక్కలేదట
ఎదలో పలికే శ్రావ్యాలకూ స్వరాలూ పలకలేదట
ఆలోచనలు పారిపోతున్నాయి
మధురోహలు బెదిరిపోతున్నాయి
"ఎందుకురా మీరు ఇలా చేస్తున్నారు?" అనడిగితే......
నీ స్నేహాన్ని వర్ణించేంత చాతుర్యం వాటికి లేదట
అంత లోతుకి దిగేంత దైర్యమూ రాదట
బయటవున్న అవే అలా అంటే
మరి నిండా మునిగిన నేనేమనాలి నేస్తమా?
తియ్యని గాయాలు
పగిలిన హృదయం
రగిలిన గాయం
చెదిరిన కళలు
అలసిన ఆశలు
ఇవే నాకు మిగిలిన తలపులు
హుం! నేనంటే అంత అలుసా ప్రియతమా?
కంటి తలుపులు మూస్తె
ఆ చీకటి కూడా చీకొడుతుంది
బండబారుతున్న నా గుండెను చూస్తె
అది పెకలించి కన్నీరు పెడుతుంది.
లోలోన నెత్తుటి కణాలు ఉడికి లవాలై ప్రవహిస్తున్నాయి.
ఎన్ని బాధలు పెడుతున్న
ఎన్ని అవమానాలు ఎదురవుతున్న
ఇంకా నీపై ఉన్నా ప్రేమే వచ్చి వాటిని చల్లార్చి నయం చేస్తుంది.
తొలకరి
తుంపర్ల దుప్పటి కప్పిన సూర్యోదయ వేళ
లతిక లేత కిరణాలు నన్ను తట్టి లేపాయి
జలదరిస్తున్న చిరు చలి గిలిగింతలకు
తనువంతా తుల్లింతై పరవశాన్ని నింపుకున్నాయి.
తొలకరి తొలి అడుగులకు చిగురాకు చివర్లను
ముద్దాడి నేలరాలిన చినుకుల తాకిడికి
పులకించిన పుడమితల్లి మట్టి వాసనల గుబాళింపును వెదజల్లుతుంటే
కరిగి పడుతున్న ఇసుక తిన్నెల కన్నీరుని చూసా
ఆవిరవుతున్న దూళి రేణువులకై వల వేసా.
పచ్చదనం పరచుకున్న పచ్చని కొండ కోనల నడుమ
వెల్లువిరిసిన హరివిల్లు సోయగాలపై వేలాడి
శ్యామవర్ణ మేఘాలపై తేలియాడి
ప్రకృతమ్మ ఒడిలో ఒదిగి ఉన్న అందాలను చూసి తరించి
వర్ణించటానికి ఈ ఒక్క కవితా చాలదని అర్ధం చేసకున్నాను.
లతిక లేత కిరణాలు నన్ను తట్టి లేపాయి
జలదరిస్తున్న చిరు చలి గిలిగింతలకు
తనువంతా తుల్లింతై పరవశాన్ని నింపుకున్నాయి.
తొలకరి తొలి అడుగులకు చిగురాకు చివర్లను
ముద్దాడి నేలరాలిన చినుకుల తాకిడికి
పులకించిన పుడమితల్లి మట్టి వాసనల గుబాళింపును వెదజల్లుతుంటే
కరిగి పడుతున్న ఇసుక తిన్నెల కన్నీరుని చూసా
ఆవిరవుతున్న దూళి రేణువులకై వల వేసా.
పచ్చదనం పరచుకున్న పచ్చని కొండ కోనల నడుమ
వెల్లువిరిసిన హరివిల్లు సోయగాలపై వేలాడి
శ్యామవర్ణ మేఘాలపై తేలియాడి
ప్రకృతమ్మ ఒడిలో ఒదిగి ఉన్న అందాలను చూసి తరించి
వర్ణించటానికి ఈ ఒక్క కవితా చాలదని అర్ధం చేసకున్నాను.
Thursday, August 5, 2010
అలకామృతం
బ్రతిమిలాట ముచ్చట్లకున్న అనుభూతి అనుభవం మధురాతిమధురం
విరహాల మధ్య పెరిగే నిగ్రహ సంఘర్షణల సమరం
అవి కోప తాపాల తీపి భావాల వలపుల సంబరం
చిలిపి చూపుల చిరాకులో బిడియమెంత సుందరం
మధ్య మొదలయ్యే మౌన మోహనం మరింత మనోహరం
అహం అడ్డగించే అనుబంధానికై ఆరాటపు సత్వరం
గడియలు గడిచేకొద్దీ ఆ కలవర స్పర్శ్యలే ఒక ఆనందసాగరం
అది ఒక అమృత ప్రేమానుబంధం.
ప్రాణ నేస్తం
నా ప్రాణంలో సగం నీలోనే ఉంది కద నేస్తమా!
నను వీడి ఎక్కడికి వెళ్తావ్?
ఒంటరి వాడ్ని చేసి ఎంత దూరం పోతావ్?
నా ఊహకందని దృశ్యాన్ని నీ ఊహకు అందనివ్వకు.
అది తట్టుకుని తారసపడలేను, భరించి బ్రతకలేను.
అవసరమైతే ఆ మిగతా సగం కూడా నీకే ఇచెస్తా,
పూర్తిగా నా ఊపిరితోనే జీవించు.
అప్పుడు మనం ఎప్పటికీ విడిపోని ప్రాణ స్నేహితులమై ఉండిపోతాం.
Friday, July 30, 2010
అదరామృతం
వర్షపు జడిలో నను తడిపి నువు తడిసి
వాన గిల్లే చలిగిలి పులకింతకు
అదిరిపడి బెదురుతున్న నా ఆదరాలను
నీ అదరామృతాలతో తాకి
వెచ్చని శ్వాసను నా గుండెల నింపి
ఒంట్లో వేడి కుంపట్లు రాజేసి నను తగలబెడుతుంటే
నీ కౌగిలి వలలో చిక్కుకుని
ముని పంటి గాటును పెదాల మాటున దాచుకుని
ఆ చినుకు తడికి ఆవిరై
నీ గుండె గూటికి చేరువై
నీలో ఏకమయిపోతా ప్రియతమా!
వాన గిల్లే చలిగిలి పులకింతకు
అదిరిపడి బెదురుతున్న నా ఆదరాలను
నీ అదరామృతాలతో తాకి
వెచ్చని శ్వాసను నా గుండెల నింపి
ఒంట్లో వేడి కుంపట్లు రాజేసి నను తగలబెడుతుంటే
నీ కౌగిలి వలలో చిక్కుకుని
ముని పంటి గాటును పెదాల మాటున దాచుకుని
ఆ చినుకు తడికి ఆవిరై
నీ గుండె గూటికి చేరువై
నీలో ఏకమయిపోతా ప్రియతమా!
Thursday, July 29, 2010
కరగని మనసు
స్నేహానికి అర్ధమైన బంధమా,
శ్రావ్యానుభూతులను చిలికి పలికించే సుధ మధురమ!
వింటివా ఎద పాడె మౌన రాగాలు?
మది పలికే మూగ భావాలు?
నేను దాచుకున్న నీ జ్ఞాపకాలపై మోహాన్ని పెంచుకుంది,
లోతెరుగని బంధాన్ని పంచిన నీ స్నేహాన్ని దోచుకుంది.
అడిగితే తిరిగి ఇవ్వనంటుంది,
నీ వద్దకు పొమ్మంటుంది.
కన్నీళ్లు వెళ్లి కరిగి మొరపెట్టుకున్నా అది కరగలేదు,
ఒప్పిస్తానని వెళ్ళిన స్పర్శ, దాని కవ్వింతకు లొంగి తిరిగి రాలేదు.
వేచి చూస్తున్న ఆశలు నా మనసుతో స్వరాలు పలుకుతున్నాయి,
గుండె సవ్వళ్ళు సైతం వాటితో శృతి కలుపుతున్నాయి.
నాకు సొంతమైన అమృతాన్ని అది సేవిస్తుంటే,
ఈర్ష్య వచ్చి ఓదార్చుతుంది.
విరహ వేదనలో నీకై పయనిస్తుంటే,
కావ్య భావాలు పెంచుతుంది.
వాటిని కూర్చి నవ్య రూపం చేర్చి చూస్తె తెలిసింది,
అది నీ స్నేహాన్ని ప్రేమిస్తుందని!
అందుకే కష్టమైనా ఇష్టంగా ఆ నష్టాన్ని భరించి జీర్నించుకున్నాను,
ఎద నుండి వెలువడే అలజడులను ఇలా వర్ణించుకున్నాను.
శ్రావ్యానుభూతులను చిలికి పలికించే సుధ మధురమ!
వింటివా ఎద పాడె మౌన రాగాలు?
మది పలికే మూగ భావాలు?
నేను దాచుకున్న నీ జ్ఞాపకాలపై మోహాన్ని పెంచుకుంది,
లోతెరుగని బంధాన్ని పంచిన నీ స్నేహాన్ని దోచుకుంది.
అడిగితే తిరిగి ఇవ్వనంటుంది,
నీ వద్దకు పొమ్మంటుంది.
కన్నీళ్లు వెళ్లి కరిగి మొరపెట్టుకున్నా అది కరగలేదు,
ఒప్పిస్తానని వెళ్ళిన స్పర్శ, దాని కవ్వింతకు లొంగి తిరిగి రాలేదు.
వేచి చూస్తున్న ఆశలు నా మనసుతో స్వరాలు పలుకుతున్నాయి,
గుండె సవ్వళ్ళు సైతం వాటితో శృతి కలుపుతున్నాయి.
నాకు సొంతమైన అమృతాన్ని అది సేవిస్తుంటే,
ఈర్ష్య వచ్చి ఓదార్చుతుంది.
విరహ వేదనలో నీకై పయనిస్తుంటే,
కావ్య భావాలు పెంచుతుంది.
వాటిని కూర్చి నవ్య రూపం చేర్చి చూస్తె తెలిసింది,
అది నీ స్నేహాన్ని ప్రేమిస్తుందని!
అందుకే కష్టమైనా ఇష్టంగా ఆ నష్టాన్ని భరించి జీర్నించుకున్నాను,
ఎద నుండి వెలువడే అలజడులను ఇలా వర్ణించుకున్నాను.
కన్నీటి రెప్పలు
ప్రణయ స్నేహం
చెలిమి బంధం లోతును తెలిపిన ప్రణయ స్నేహమా !
ఎద చిలికిన జ్ఞాపకాలలో తేలిన వెన్నపూసలివి ,
మది పలికిన భావాలలో రాలిన సంపద రాసులివి .
చిగుర్లు తొడిగిన బంధాలు ,
పెరిగి దగ్గరైన సుగంధ పరిమళాలు ,
మౌనం ఇచ్చిన శాపాలు,
నిను చూడని క్షణాల్లో విరహ వేదనలు,
కన్నీరై కరిగిన అలకాస్త్రాలు,
అనుమతులై అలరించిన శాసనాలు,
ఇట్టి ఎన్నో సుధ మధురాలై అవతరించింది నీ స్నేహం.
వాటిని విడిచి నేనుండగలనా?
నీ బంధం లేక నే బ్రతకగాలనా ?
అణువణువునా ఇమిడి, హృదయ శ్వాసల్లో నిండి ఉంది నీ రూపం,
ప్రతిక్షణం నా తోడై నడిపిస్తుంది నీ స్నేహం .
ప్రణయమై నా ప్రాణమై నను బ్రతికిస్తుంది ఆ అమృత అనుబంధం.
కనిపించని కన్నీళ్లు
అమృత స్నేహానుబంధమా!
నా పట్ల నీపై నీకున్న నమ్మకానికి కృతజ్ఞుడను.
అంతకన్నా ముందు మన స్నేహాన్ని నమ్మవా?
ఆ ప్రియ బంధాన్ని ప్రేమించే నన్ను అర్ధం చేసుకోలేవా?
మాట పట్టింపు విడవద్దని మనస్సాక్షి శాసించింది,
నీ మాట వినలేదని అంతరాత్మ దూషించింది.
తప్పు చేసానన్న భావన వెంటాడి దుయ్యబడుతుంది,
బాధ పెట్టానన్న వేదన వేటాడి హింసిస్తుంది.
దేన్నీ పట్టించుకోని మనసు నాపై మండిపడుతుంది,
స్పర్శలన్నీ ఎడబాటున ఉండి నరకయాతనా పెడుతున్నవి.
ఏం! ఆ శాసనం నీదే ఐతే పాటించక పోదునా?
ఒక్క మాట గట్టిగా చెప్పి ఉంటె కాదందున?
ఇప్పుడు నీతో మాటాడమంటే నాలుక నొచ్చుకుంటుంది,
నిన్ను చుడాలని ఉన్నా, కనురెప్పలు సహకరించక కప్పుకుపోతున్నాయి.
ఎదురుగ నిలవటానికి కాళ్ళు అదిరిపోతున్నాయి,
నీ వద్ద అర్హత కోలుపోయానని మది చెదిరి బెదిరిపోతుంది.
నీ స్నేహానికి దూరమవుతానేమో అని భయమేస్తుంది.
నిన్ను గాయపరిచానన్న వేదన భారమైంది.
నా ముఖం చూపటానికి సిగ్గుపడుతున్నాను,
పరిస్థితి అర్ధం చేసుకుని మాట మన్నించమని వేడుకుంటున్నాను.
నీ నమ్మకం వమ్ము చేసి బాధ పెట్టినందుకు క్షమించమంటున్నాను.
ప్రాణమైన స్నేహమా, నన్ను క్షమించమ్మా!
కాంతి రేఖ
కారు మబ్బులు కమ్మాయని గగనమేమై నా తామసిలో కుమిలిపోతుందా?
కాంతి కోసం వెలుగు రేఖల మెరుపులు చిందించదా!
తీరం మొత్తాన్ని తాకలేదని సంద్రమేమైనా అసహనాన్ని ప్రదర్శిస్తున్నదా?
కడలి కడుపులో ఉన్న అలలను వరుసకట్టి పంపించదా!
ఎదలో వ్యద రగిలిందని మదిని పగలుగోట్టుకుంటామా?
నీకు తోడై నీడగా నిలిచె మనోధైర్యం నీకుందిగా!
కాంతి రేఖలను నింపి, అలలల్లె నిన్ను పైకి ఎగసింపజేయదా!
అందుకే నీ సున్నితత్వంతోనే పై తత్వాన్ని ఎదురీదు,
నీ వెన్నంటే నీ సంకల్పం ఉండి ముందుకు నడిపిస్తుంది.
Wednesday, July 21, 2010
అర్ధం కాని నా మనసు.
నేనేంటో నీకు తెలుసు, అయినా ఎందుకంత దురుసు?
ఎవరికీ అర్ధం కానంటావ్, అందర్నీ అర్ధం చేసుకుంటావ్,
నిన్ను అర్ధం చేసుకున్న వారికి ఎప్పుడూ దగ్గరంటావ్,
మరి నన్నెప్పుడు అర్ధం చేసుకుంటావ్?
అసలు నాకెప్పుడు అర్ధం అవుతావ్?
నచ్చితే వస్తావ్, తోచింది చేస్తావ్,
నవ్వుతావ్, నవ్విస్తావ్, కొన్నిసార్లు సున్నితంగా ఏడుస్తావ్,
ఏదీ దాచనంటావ్, ఎవర్నీ వదులుకోనంటావ్,
నిన్ను నువ్వే శాశించుకుంటావ్, కొందరికే దాసోహమంటావ్.;
స్థాయి భేదం చూపిస్తే వీడ్కోలు పలుకుతావ్.
నిర్ణయాన్ని మర్చుకోనంటావ్, మొండిగా ప్రవర్తిస్తావ్,
వ్యక్తిత్వం మీదకు వస్తె, నీ వారిని కూడా వదిలేస్తానంటావ్.
అసలు ఏంటి నీ ధైర్యం, ఎందుకంత అహం?
ఇన్ని తిట్టినా నన్ను మాత్రం విడిచి పోనంటావ్.
అసలు నువు ఎప్పుడు ఎలా ఉంటావ్?
నాతో ఎందుకిలా ఆడుకుంటావ్?
నాలో సగం
నాలో సగమైన స్నేహమా!
నా ఊపిరై నడిపిస్తున్న ప్రాణ నేస్తమా!
నిను విడిచి పొమ్మంటే, నే శూన్యమై పోతానే,
నీ బంధాన్ని తెంచుకుని పొమ్మంటే, నా ప్రాణాన్నే విడిచి వెల్తానే.
నీ స్నేహమే నా శ్వాస అయినపుడు,
అది లేక నేనెట్లా బ్రతకగలను?
నన్ను విడిచి నువ్వు ఉండగలవన్న ధైర్యం నీకున్నపుడు,
ఆ మనో ధైర్యాన్ని నాకు కూడా ఇచ్చిపో!
నా తుది శ్వాస వరకు నీ జ్ఞాపకాలతో గడిపెస్తా!
నా ఊపిరై నడిపిస్తున్న ప్రాణ నేస్తమా!
నిను విడిచి పొమ్మంటే, నే శూన్యమై పోతానే,
నీ బంధాన్ని తెంచుకుని పొమ్మంటే, నా ప్రాణాన్నే విడిచి వెల్తానే.
నీ స్నేహమే నా శ్వాస అయినపుడు,
అది లేక నేనెట్లా బ్రతకగలను?
నన్ను విడిచి నువ్వు ఉండగలవన్న ధైర్యం నీకున్నపుడు,
ఆ మనో ధైర్యాన్ని నాకు కూడా ఇచ్చిపో!
నా తుది శ్వాస వరకు నీ జ్ఞాపకాలతో గడిపెస్తా!
Tuesday, July 20, 2010
ప్రశ్నార్ధకం!!
లేపినదెవరు? వెన్ను తట్టి లేపినదెవరు?
విక్రాంతమైన మదిలో చలనం నింపినదెవరు?
మండుతున్న ఎండమావిలో తొలకరులు కురిపించినదెవరు?
ఆవిరవుతున్న ఆశలకు ఆశ చూపినదెవరు?
విక్రాంతమైన మదిలో చలనం నింపినదెవరు?
మండుతున్న ఎండమావిలో తొలకరులు కురిపించినదెవరు?
ఆవిరవుతున్న ఆశలకు ఆశ చూపినదెవరు?
మోడుబారిన మొక్కకు నీరు పోసినదె వరు?
నిగ్రహం నడిపిస్తున్న వేళ విరహం విరబూయించినదెవరు?
నీకు తెలియదు కదా!
ఐతే నేను నీతో గడిపిన క్షణాలను అడుగు చెబుతాయి.
వ్యక్తపరచని భావాలను గ్రహించినదెవరు?
తెంచుకున్న అనుభవాలను పంచుకున్నదెవరు?
ఏకాంతం కోరుకున్న ఏకాకికి కొలువైనదెవరు?
వైరాగి అయిన వాడికి వైడూర్యమై దొరికినదెవరు?
ఇంకిపోయిన కళ్ళల్లో చెమ్మ చేర్చినదెవరు?
చెదిరిన అదరాలపై దరహాసపూరెకలు పూయించినదెవరు?
నీకు తెలియదు కదా!
ఐతే నువ్వు నాతొ గడిపిన క్షణాలను అడుగు చెబుతాయి.
వలదని వదిలేసిన స్పర్శను చేతికి అందించినదెవరు?
స్నేహమన్న బంధాన్ని మళ్ళీ రుచిచూపినదెవరు?
నేస్తమై పక్కన నడిచినదెవరు?
కలిసికట్టుగ చేయిపట్టి ముందుకు నడిపించినదెవరు?
మరచిన అనుభూతులను గుర్తు చేసినదెవరు?
గాయపడిన గుండెకు వెన్న పూసి నయం చేసినదెవరు?
నీకు తెలియదు కదా!
ఐతే మనం కలిసి గడిపిన క్షణాలను అడుగు చెబుతాయి.
రావనుకున్న కన్నీళ్ళు నువు దూరమవుతుంటే వచ్చాయి,
నాలుకపైకి చేరి అందులో మాధుర్యాన్ని పంచాయి.
మల్లీ ఒంటరినవుతున్నానన్న వేదనతో గుండె బరువెక్కింది,
ఆవేదనతో లోలోపలే రోదించింది.
పరిణతి చెందినా నేను ఎందుకలా స్పంధించాను?
నీకు తెలియదు కదా!
ఏమో రా మరి! ఎందుకో నాకూ తెలియదు.
నిగ్రహం నడిపిస్తున్న వేళ విరహం విరబూయించినదెవరు?
నీకు తెలియదు కదా!
ఐతే నేను నీతో గడిపిన క్షణాలను అడుగు చెబుతాయి.
వ్యక్తపరచని భావాలను గ్రహించినదెవరు?
తెంచుకున్న అనుభవాలను పంచుకున్నదెవరు?
ఏకాంతం కోరుకున్న ఏకాకికి కొలువైనదెవరు?
వైరాగి అయిన వాడికి వైడూర్యమై దొరికినదెవరు?
ఇంకిపోయిన కళ్ళల్లో చెమ్మ చేర్చినదెవరు?
చెదిరిన అదరాలపై దరహాసపూరెకలు పూయించినదెవరు?
నీకు తెలియదు కదా!
ఐతే నువ్వు నాతొ గడిపిన క్షణాలను అడుగు చెబుతాయి.
వలదని వదిలేసిన స్పర్శను చేతికి అందించినదెవరు?
స్నేహమన్న బంధాన్ని మళ్ళీ రుచిచూపినదెవరు?
నేస్తమై పక్కన నడిచినదెవరు?
కలిసికట్టుగ చేయిపట్టి ముందుకు నడిపించినదెవరు?
మరచిన అనుభూతులను గుర్తు చేసినదెవరు?
గాయపడిన గుండెకు వెన్న పూసి నయం చేసినదెవరు?
నీకు తెలియదు కదా!
ఐతే మనం కలిసి గడిపిన క్షణాలను అడుగు చెబుతాయి.
రావనుకున్న కన్నీళ్ళు నువు దూరమవుతుంటే వచ్చాయి,
నాలుకపైకి చేరి అందులో మాధుర్యాన్ని పంచాయి.
మల్లీ ఒంటరినవుతున్నానన్న వేదనతో గుండె బరువెక్కింది,
ఆవేదనతో లోలోపలే రోదించింది.
పరిణతి చెందినా నేను ఎందుకలా స్పంధించాను?
నీకు తెలియదు కదా!
ఏమో రా మరి! ఎందుకో నాకూ తెలియదు.
అదే ప్రశ్నార్ధకం!!
Dedicated to my dearest BEST FRIEND MUKKU....
Monday, July 19, 2010
ఎవరిదీ ప్రకృతి?
ఎవరిదీ ప్రకృతి? నీదా? నాదా?
సహజ సిద్ద అందాలను అద్దిన ఈ సృష్టిదా?
నవ జీవన ఆయువుపట్టు దాచుకుని అంతరిస్తున్న కాలానిదా?
జీవ వాయువును దోచుకుని అంతం చేస్తున్న జనానిదా?
సూక్ష్మ జాతులదా? కీటక ప్రాణులదా?
లేక వాటిపై ఆధారపడి బ్రతికే పశు వృక్షాలదా?
ఎవరిదీ? ఎవరిదీ ప్రకృతి?
నోళ్ళు తెరచి నిప్పులు కక్కి కాల్చే అగ్ని పర్వతాలదా?
వినాశనానికొడిగట్టి కన్నీళ్ళు కార్చే జడివానదా?
పొంగి పొరిలి జల విలయం సృష్టించే ప్రలయానిదా?
భూ భారం భరించలేక బాధతో పెకలించే ప్రకంపనలదా?
సుడిగుండానిదా? వాయు వేఘానిదా?
లేక కారు మబ్బులు కమ్మి పిడుగుపాటు దెబ్బలు కొట్టే నీలి మేఘానిదా?
ఎవరిదీ? ఎవరిదీ ప్రకృతి?
అణగదొక్కి ఎదుగుతున్న అగ్రరాజ్య ఆధిపత్యానిదా?
ధీటుగా డీకొనాలని పరితపిస్తున్న చిన్నరాజ్యాల అభివృద్ధిదా?
కూటికై నిరీక్షించి కరిగిన కన్నీటిని తాగే పేదరికానిదా?
అలమటిస్తున్న కడుపులు మండి కబళించే ఆకలి కేకలదా?
ఆధునిక కాలానిదా? నాగరికత నైజానిదా?
లేక, అంతరించిపోతున్న జీవ జాతులలో తన స్థానం మరచి
ముంచుకొస్తున్న వైపరిత్యాలను విష్మరించి
సర్వ సృష్టిని శాసించాలన్న వ్యామోహంలో ఉన్న స్వార్ధ మానవుడిదా?
ఎవరిదీ ప్రకృతి?
ఏమో! తరిగిపోతున్న మనుగడ కోసం కరిగిపోతున్న కాలమే నిర్ణయించాలి.
ఏమో! తరిగిపోతున్న మనుగడ కోసం కరిగిపోతున్న కాలమే నిర్ణయించాలి.
మౌన రాగం
నీ గాలి సోకిన నా మనసుకి చలనం కలిగె
స్పంధించిన నా గుండె నీకై ప్రణయ గానం పాడె.
నవీన అలజడులు నా నరాల మీటలు నొక్కి సుస్వరాలు వినిపిస్తుంటే,
గానం తెలియని నా గాత్రంలో నీకై ఏవో రాగాలు పలికాయి.
గుండె పొరలు చీల్చుకుని శృతిలయ శబ్దాలు ధ్వనిస్తుంటే,
ఏవో తెలియని తియ్యని గాయాలు రగిలాయి.స్పంధించిన నా గుండె నీకై ప్రణయ గానం పాడె.
నవీన అలజడులు నా నరాల మీటలు నొక్కి సుస్వరాలు వినిపిస్తుంటే,
గానం తెలియని నా గాత్రంలో నీకై ఏవో రాగాలు పలికాయి.
గుండె పొరలు చీల్చుకుని శృతిలయ శబ్దాలు ధ్వనిస్తుంటే,
మౌన రాగం తీస్తూనే నువు నాలో ఇన్ని భావాలు పలికిస్తుంటే
అది నీపై కలిగిన నా ప్రేమ కాదని నేననగలనా?
ఇంకెన్నాళ్ళు ?
తారస పడితే విస్మరించి బాధిస్తావు గానీ,
నా కళ్ళు చెప్పే ఊసులు వినవెందుకు?
ఎరుపెక్కిన ఆకాశాన్ని నీ కళ్ళలో చూపిస్తావు గానీ,
చెమ్మగిల్లి విలపించే నా కళ్ళను చూడవెందుకు?
తేనెలూరే అదరాలపై నిప్పులు చిందించే బదులు
వాటిపై హిమమై కరిగే నా పెదాలను చేర్చుకోవెందుకు?
గుచ్చి గుచ్చి చంపే నీ కఠిన మాటలు తప్ప
నా మనసు పలికే మూగ భావాలు వినపడవా?
పట్టు విడువని మూర్ఖ వైఖరి తప్ప
నీకై రోధించే నా గుండె కోత కనపడదా?
నా కళ్ళు చెప్పే ఊసులు వినవెందుకు?
ఎరుపెక్కిన ఆకాశాన్ని నీ కళ్ళలో చూపిస్తావు గానీ,
చెమ్మగిల్లి విలపించే నా కళ్ళను చూడవెందుకు?
తేనెలూరే అదరాలపై నిప్పులు చిందించే బదులు
వాటిపై హిమమై కరిగే నా పెదాలను చేర్చుకోవెందుకు?
గుచ్చి గుచ్చి చంపే నీ కఠిన మాటలు తప్ప
నా మనసు పలికే మూగ భావాలు వినపడవా?
పట్టు విడువని మూర్ఖ వైఖరి తప్ప
నీకై రోధించే నా గుండె కోత కనపడదా?
ఎన్నేళ్ళని నీకై వీక్షించను?
ఇంకెన్నాలని నీకై నిరీక్షించను?
Sunday, July 18, 2010
నా సంధ్యా!
రోజు ముగిసే సమయాన వచ్చి పలకరించే ముగ్ధ సింగారమట
నీలి గగనమున విరిసి మెరిసే ముద్ద బంగారమట
పసుపు పచ్చ చీర కట్టిన లేత మందారమట
నులువెచ్చని నూలుపోగు సువర్ణ వర్ణములు నీకు సొంతమట
పల్చగా పరుచుకున్న చీకటి తెరల చిత్రమట
అలసిన హృదయాలను సేదదీర్చే ప్రకృతి పత్రమట
భగ్గుమన్న భానువుని చల్లార్చి అలంకరించుకున్న సుందర వదనమట
అందమంత ఆరబోసి అస్తమించే సుమధుర దృశ్యమట
చీకటి వెలుగుల మధ్య సందె కుదుర్చి కరిగిపోయే ఓ సంధ్యా!
రమణీయ కాంతుల కొలువై చెరిగిపోయే నా సంధ్యా!
నిను చూసిన నా కళ్ళు నన్నే మరచిపోయాయి
మలి సందె వేళ వరకు నిరీక్షిస్తున్నాయి.
నీలి గగనమున విరిసి మెరిసే ముద్ద బంగారమట
పసుపు పచ్చ చీర కట్టిన లేత మందారమట
నులువెచ్చని నూలుపోగు సువర్ణ వర్ణములు నీకు సొంతమట
పల్చగా పరుచుకున్న చీకటి తెరల చిత్రమట
అలసిన హృదయాలను సేదదీర్చే ప్రకృతి పత్రమట
భగ్గుమన్న భానువుని చల్లార్చి అలంకరించుకున్న సుందర వదనమట
అందమంత ఆరబోసి అస్తమించే సుమధుర దృశ్యమట
చీకటి వెలుగుల మధ్య సందె కుదుర్చి కరిగిపోయే ఓ సంధ్యా!
రమణీయ కాంతుల కొలువై చెరిగిపోయే నా సంధ్యా!
నిను చూసిన నా కళ్ళు నన్నే మరచిపోయాయి
మలి సందె వేళ వరకు నిరీక్షిస్తున్నాయి.
Saturday, July 17, 2010
ఆమే నాకు ప్రేమ.
ప్రేమించని వాడి బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా?
అందుకే నేనూ ప్రేమిస్తున్నాను.
ఆమె ప్రేమకు సాటే లేదు,
మరెవరి ప్రేమ పోటీ రాదు.
నా ఆనందమే తనకానందం అనేది,
ఏ హానీ జరగకూడదని కోరుకునేది.
తప్పు చేస్తే నాపై కసురుకునేది,
మాట వినకుంటె నన్ను కొట్టేది కూడా!
నేను అలిగి కన్నీరు పెడితే తన తియ్యని ముద్దుతో వాటిని కరిగించేది,
ఆమెనూ ముద్దాడమని చెక్కిలి చూపి నాపై ప్రేమను పెంచేది.
వనుకు పుడితే ఆమె కౌగిలి నాకు వసమయ్యేది,
నిదురోస్తే తన ఒడి నాకు సొంతమయ్యేది.
ఆమె చేతిని వదలకుండా పక్కనే చోటు ఇచ్చేది,
ప్రేమను తెలిపి గుండెలకు హత్తుకునేది.
తీరిక వేళల్లో నా చేతులను మెడ చుట్టూ పెనవేసుకుని కబుర్లు చెప్పేది,
నా సుఖదుఖాల్లో భాగాన్ని అడిగేది.
తప్పొప్పులు చూపి, మంచి చెడులు సూచించేది,
విజయ భాటలకై చెంత ఉండి నడిపించేది.
అల్లరి చేసినా ఆనందపడి నన్ను కడుపులో దాచుకుంది,
కోరినది ఇచ్చి ఇంత వాడిని చేసింది.
ఆ ప్రేమంతా అమృతమయం, లోతెరుగని కమ్మదనం.
అదే నా అమ్మ ప్రేమ.
అవును, అమ్మే నాకు ప్రేమ.
హిమ బిందువునై
మరింత శ్యామమై
నా పై హిమమై కరిగి
చిరు చినుకులై కురిపిస్తూ
ప్రేమగా నన్ను మైమరిపిస్తుంటే
ప్రేమగా నన్ను మైమరిపిస్తుంటే
పరవశించిన నాలోన ఉల్లాసం
ఉరకలేస్తూ, నన్ను తడవమని తరుముతుంటే
ఆపటం నా తరమా ప్రియతమా!
నువ్వు కురిపించే ప్రేమ బిందువుల్లో
నేను సైతం ఒక హిమ బిందువునై
కరిగిపోతూ నీ ప్రేమలో కలిసిపోతాను
Oh my dear!
Oh my dear! I like to tease U bcz,
I can sense your closeness.
I like to slap U bcz,
I can touch your feelings.
I like to make U angry bcz,
I can pass through your emotions.
I can sense your closeness.
I like to slap U bcz,
I can touch your feelings.
I like to make U angry bcz,
I can pass through your emotions.
I like to misunderstand U bcz,
I can understand your mind more better.
I like to hurt U bcz,
I can touch your heart.
I like to make U cry bcz,
I can bare your pain.
I like to miss U bcz,
I can feel your presence.
I like to avoid U bcz,
I can spot your distance.
I like to hate U bcz,
I can just have your pure Love.
I like to feel U bcz,
You are my Sweet Loving Best Friend.
And I Love U forever bcz,
U are part of Me.
I like to hurt U bcz,
I can touch your heart.
I like to make U cry bcz,
I can bare your pain.
I like to miss U bcz,
I can feel your presence.
I like to avoid U bcz,
I can spot your distance.
I like to hate U bcz,
I can just have your pure Love.
I like to feel U bcz,
You are my Sweet Loving Best Friend.
And I Love U forever bcz,
U are part of Me.
నిరీక్షణ
అలుపు లేని నా నిరీక్షణ,
నీ జాడకై గాలిస్తుంది.
ఏ చోట ఉన్నా,
నా చూపులకు నువ్వు చిక్కకపోయినా,
నీ దృష్టిలో ఎక్కడైనా చిక్కుకుంటానేమో
అన్న చిన్న ఆశతో,
నా ఆరాటం నీకై తిరుగుతుంది.
కల
నా కనురెప్పల చాటున దాగి,
కనిపించినా నాపై కనికరం లేదే నీకు!
చీకటిని చెరిపి, వెలుగు రేఖలు నింపి,
నీ దర్శన భాగ్యం కలిగించావు.
అది, కనురెప్పలు కదిపితే
కరిగిపోయేంత అవాస్తవం అయినా,
ఆ స్వప్నాన్ని చూసిన నా ఆనందానికి
అవధులు లేవు నేస్తమా!
ప్రణయ ఘోష
ఇది కలయా లేక నిజామా!
ఎదురు పడితే ఎరుపెక్కే కళ్ళు,
నేడు వాటినే చెంతకు చేర్చుకున్నాయి.
బండలా ఉండే గుండె, మెత్తని మనసైంది,
నేను ఆశించిన స్పర్శ వచ్చి నా శ్వాసను ఆశిస్తుంది.
నా ధ్యాసను కూడా ధరికి రానివ్వని మది,
దాని ఎదనిండా ఇప్పుడు నన్నే నింపుకుంది.
ఇప్పుడే పరిమళించిన మధురామృత భావాలు,
ప్రణయ ఘోషలో చేరి స్పర్శతో నన్ను హత్తుకున్నాయి,
చెలి చూపుల భయంతో వణికే నాకు,
వెచ్చని కౌగిలిలో వాలె అపురూప అవకాశాన్ని కలిగించాయి.
ఎదురు పడితే ఎరుపెక్కే కళ్ళు,
నేడు నాకై రొధిస్తూ కరిగిపోతున్నాయి.
నా పిలుపే పట్టించుకోని చెవులు, నా పలుకుకై తెరలు తెరుచుకున్నాయి.
అనుక్షణం జ్వలించె అదరాలు,నాపై వాలి హిమమైనాయి.
నా చెంపలను ఛల్లుమనిపించాలనుకున్న చేతులు,నేడు వాటినే చెంతకు చేర్చుకున్నాయి.
బండలా ఉండే గుండె, మెత్తని మనసైంది,
నేను ఆశించిన స్పర్శ వచ్చి నా శ్వాసను ఆశిస్తుంది.
నా ధ్యాసను కూడా ధరికి రానివ్వని మది,
దాని ఎదనిండా ఇప్పుడు నన్నే నింపుకుంది.
ఇప్పుడే పరిమళించిన మధురామృత భావాలు,
ప్రణయ ఘోషలో చేరి స్పర్శతో నన్ను హత్తుకున్నాయి,
చెలి చూపుల భయంతో వణికే నాకు,
వెచ్చని కౌగిలిలో వాలె అపురూప అవకాశాన్ని కలిగించాయి.
ఈ జన్మకు వినననుకున్న మూడు మాటలు ఆ నోట విన్నాక,
బిగిసిన నరాలు వీనలై నవీన అలజడులు రేపిన అనుభూతిలొ
స్వరాలు పలికిస్తుంటే,
ఇదేమి చిత్రమో!............
బిగిసిన నరాలు వీనలై నవీన అలజడులు రేపిన అనుభూతిలొ
స్వరాలు పలికిస్తుంటే,
ఇదేమి చిత్రమో!............
వాటితో శృతి కలపాల్సిన నా గుండె చప్పుడు,
సుధీర్ఘ విశ్రాంతి తీసుకుంటుంది.
ఇన్నేళ్ళూ చలనం లేని చెలిని చూసి,
చెదిరిన నా మనసు శూన్యమైపోయింది.
కానరాని వాయువులో కలిసి,
తిరిగి రాని విహరాలకై ఆయువు ఎగసిపోయింది.
చూడాలని ఉన్నా, కను రెప్పలు బరువెక్కిపోతున్నాయి,
భావాలను పంచుకోవాలని ఉన్నా, అవి చేదిరిపోతున్నాయి.
కానీ నీ ప్రేమ మాత్రం నన్ను చేరుతుంది,
నువు స్పంధించిన స్పర్శ నన్ను తాకుతుంది.
ఇది కలయా? నిజామా?
రెప్ప తెరిస్తే ఉంటావో లేదో!
పలకరిస్తే కసురుకుంటావో ఏమో!
అందుకే దీర్ఘాందకారంలో నిద్రిస్తున్నా,
నీ రెప్పల మాటున వెలుగుతున్నా.
సుధీర్ఘ విశ్రాంతి తీసుకుంటుంది.
ఇన్నేళ్ళూ చలనం లేని చెలిని చూసి,
చెదిరిన నా మనసు శూన్యమైపోయింది.
కానరాని వాయువులో కలిసి,
తిరిగి రాని విహరాలకై ఆయువు ఎగసిపోయింది.
చూడాలని ఉన్నా, కను రెప్పలు బరువెక్కిపోతున్నాయి,
భావాలను పంచుకోవాలని ఉన్నా, అవి చేదిరిపోతున్నాయి.
కానీ నీ ప్రేమ మాత్రం నన్ను చేరుతుంది,
నువు స్పంధించిన స్పర్శ నన్ను తాకుతుంది.
ఇది కలయా? నిజామా?
రెప్ప తెరిస్తే ఉంటావో లేదో!
పలకరిస్తే కసురుకుంటావో ఏమో!
అందుకే దీర్ఘాందకారంలో నిద్రిస్తున్నా,
నీ రెప్పల మాటున వెలుగుతున్నా.
ప్రియ! నేను కనుమూస్తే గాని స్పంధించని
నీ మనసుకై ఎన్ని జన్మలైనా ఎత్తి కన్నుమూస్తా..........
ఆశ
నిన్ను కలవాలన్న ఆశ నాకే కాదు,
నా ఎదలో భావాలకు కూడా.
నా ఎదలో భావాలకు కూడా.
కానీ ఆ ఆశ నా ఆశకు లేదనుకుంటా,
ఎప్పుడు నిన్ను కలవాలని ఆశ పడినా,
ఎప్పుడు నిన్ను కలవాలని ఆశ పడినా,
నా ఆశ మాత్రం నిరాశనే కలుసుకుంటుంది.
దానికి నిరాశపై ఎంత ఆశో చూసావా!
దానికి నిరాశపై ఎంత ఆశో చూసావా!
ఇక నా నిరాశకు కూడా ఎంత ఆశో!
నా ఆశను కలిసి,
ఎప్పుడూ నిరాశను మిగల్చాలనే ఆశిస్తుంది.
నా ఆశను కలిసి,
ఎప్పుడూ నిరాశను మిగల్చాలనే ఆశిస్తుంది.
నిరాశకే అంత ఆశ ఉంటే నాకెంత ఉండాలి?
అందుకే ఎన్ని నిరాశలు నా ఆశకు ఎదురైనా,
నిన్ను కలవాలనే ఆశకు మాత్రం నాలో నిరాశ లేదు.
అందుకే ఎన్ని నిరాశలు నా ఆశకు ఎదురైనా,
నిన్ను కలవాలనే ఆశకు మాత్రం నాలో నిరాశ లేదు.
నా గుండెలోనే
నీ చిరు వెచ్చని శ్వాసకు నా తనువంతా
ముచ్చెమటల్లో మునిగిపోతుంది.
అది సుతి మెత్తని ప్రదేసమైతేనేం
కుదిపెస్తూ నన్ను కదిపెస్తూ
భీకరంగా చప్పుడు చెసెస్తూ
నన్ను కంగారు పెట్టి భయపెడుతుంటే,
ఆ తరంగాలలో పలికిందొక తియ్యని రాగం,
"భయపడకు ప్రియతమా! నువ్వున్నది నా గుండెలోనే కదా !" అని
Friday, July 16, 2010
స్పూర్తి
నువ్వెంత నేనెంత అన్నంతగా విరుచుకుపడే వాటి పోరాటం చూడు.
దేని కొరకు ఆ ఆరాటం?
ఎవరి కొరకు వాటి పోరాటం?
కారణమేదైనా, లక్ష్యం ఎంతటిధైనా,
నిండైన ఆత్మ విశ్వాశంతో,
అసహనానికి గురికాని నిరంతర కృషికి అవి నిదర్శనం,
అలుపన్నది రానివ్వక, గెలుపన్నది జారిపోనివ్వక
ఆశ చెదరని శ్రమకు అవి ఆదర్శ్యం.
" గుండె నిండిన స్పూర్తి తొ ముందుకు సాగిపో..."
అని ఘోషిస్తున్న ఆ కెరటాల పిలుపుని గ్రహించు,
పట్టు వదలక నువ్వనుకున్నది సాధించు.
పిచ్చి మాటలు
ఆశయాల ఒడిలో శెయనిస్తున్న వెర్రివాడిని!
విజ్ఞాన వెలుతురులో నీతి భాటన పయనించిన అజ్ఞానిని,
న్యాయ సమాజానికై వెతికి అన్యా యమైపోయిన భాటసారిని.
అధికార పాశాల ఆధిపత్యానికి బలైన బడుగు జీవిని ,
అధర్మం అడ్డుగోడలకు ఆగిపోయిన బలహీనుడిని.
మంచితనమే మార్గం చుపునని నమ్మిన
మంచివాడిని, నేనొక పిచ్చివాడిని!
ఆశయాల ఒడిలో శెయనిస్తున్న వెర్రివాడిని!
ఆవేశాలతొ ఉడికిన రక్తం చల్లారి సేదదీరుతున్నది,
ఆదర్శాలకై చిందిన స్వేదం అలసిపోయి ఆవిరై నది.
రాసిన నుదుటి రాతలు గజిబిజి గీ తలైనాయి,
వేసిన భవిష్య ప్రణాళికలు చెరిగి శూన్యమైనాయి.
కల్లుండి దారి తెలియని అందుడినైతిని,
నోరుండి మాటరాని మూగావాడినైతిని.
ఏదో సాధించాలనుకున్న పిచ్చివాడి ని!
ఏదీ సాధించలేకపోయిన వెర్రివాడిని!
హేళన చేసి నా నవ్వు విరగబడి నవ్వుతున్నది,
పీకుడెరుగని నోరు నిర్విరామంగా ఏదో పలుకుతుంటది.
వాటి భావం గ్రహించని జనం మధ్య నేనెందుకు?
ఒక దారిని చూపలేని ఈ పిచ్చి లోకం నాకెందుకు?
ఎవరితోనూ పని లేదు,
యోచించాల్సిన అవసరమూ లేదు.
నేనొక స్వతంత్ర జీవిని, నేనొక పిచ్చివాడిని!
ఆశయాల ఒడిలో శెయనిస్తున్న వెర్రివాడిని!
నాకు ఎదురే లేదు, ఇంకెవరూ అడ్డుకాదు.
క్షణం కూడా మనశ్శాంతి కరువైన ఈ లోకంలో,
ఎంతో ప్రశాంతంగా ఉన్న నా నవ ప్రపంచం చూడు!
నెల రాలిన పర్ణాలు వేల విలువ చేస్తాయి,
నిశబ్ధమే ధ్యేయంగా గులక రాళ్ళు నా చేతికి చిక్కుతాయి.
చిరు గాలికి ఎగురుతూ చిత్తు కాగితం నా ఒడికి చేరుతుంది,
చిరిగిన వస్త్రం, అరిగిన చెప్పు నన్ను వరించి హత్తుకుంటాయి.
ఇంత సంపద నా చెంత ఉండగ పక్కవాడితో పనేముంది?
యోచించాల్సిన అవసరం ఏముంది?
ఈ పిచ్చిలోకం నాకు పిచ్చంటుంది,
నా మాటలు గట్టి మాటలు కావు,
వట్టి మాటలు కానే కావు, కేవలం పిచ్చి మాటలంటుంది.
అవును! ఈ పిచ్చి జనాలకు నేనొక పిచ్చివాడిని,
ఆశయాల ఒడిలో శెయనిస్తున్న వెర్రివాడిని.
వీధి బాలలం
వీధి బాలలం మేం వీధి బాలలం
భరత మాత కన్న భావి పౌరులం
మల్లెపూల మనసుగల మంచి మనుషులం
విసిరిగొట్టిన సమాజంలో చెదురుతున్న చిరునవ్వులం
మురికి గుడ్డలు ధరించిన సైనికులం
బతుకు బండి నడిపేందుకు పోరాడుతున్న యోధులం
వీధి బాలలం మేం వీధి బాలలం
విధి వంచనకు తల వంచిన విధి బాలలం
కన్న వాళ్ళు లేని అనాధులం
ఉన్నా చేరదీయని అభాగ్యులం
కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న పసి పిల్లలం
బతుకు భారం మోస్తూ చితికిపోతున్న పని పిల్లలం
వీధి బాలలం మేం వీధి బాలలం
మురికి కాల్వల నిలయమున్న మొండి బాలలం
తెల్లకాగితపు రాతలు తెలియని అనామకులం
చిత్తు కాగితాలు చేత పట్టిన శ్రామికులం
బడి ఒడి చేరని చిన్నారులం
మెతుకు వెతుకులాట మధ్య నలుగుతున్న భాటసారులం
వీధి బాలలం మేం వీధి బాలలం
విద్య విలువ తెలియని వెర్రి బాలలం
గమ్యం ఎరుగని జీవన యాణికులం
పూట గడవాలని యోచించే యాచకులం
ఆకలి కేకలు చల్లార్చుకునే చిన్న పిల్లలం
రేపటి రాకకై ఆశించని అమాయకులం
వీధి బాలలం మేం వీధి బాలలం
పొట్టను చేత పట్టి ఒకటైన కుటింబీకులం
భరత మాత వీధిలో నిదురిస్తున్న వీధి బాలలం
మేమే ఆ భావి పౌరులం.
భరత మాత కన్న భావి పౌరులం
మల్లెపూల మనసుగల మంచి మనుషులం
విసిరిగొట్టిన సమాజంలో చెదురుతున్న చిరునవ్వులం
మురికి గుడ్డలు ధరించిన సైనికులం
బతుకు బండి నడిపేందుకు పోరాడుతున్న యోధులం
వీధి బాలలం మేం వీధి బాలలం
విధి వంచనకు తల వంచిన విధి బాలలం
కన్న వాళ్ళు లేని అనాధులం
ఉన్నా చేరదీయని అభాగ్యులం
కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న పసి పిల్లలం
బతుకు భారం మోస్తూ చితికిపోతున్న పని పిల్లలం
వీధి బాలలం మేం వీధి బాలలం
మురికి కాల్వల నిలయమున్న మొండి బాలలం
తెల్లకాగితపు రాతలు తెలియని అనామకులం
చిత్తు కాగితాలు చేత పట్టిన శ్రామికులం
బడి ఒడి చేరని చిన్నారులం
మెతుకు వెతుకులాట మధ్య నలుగుతున్న భాటసారులం
వీధి బాలలం మేం వీధి బాలలం
విద్య విలువ తెలియని వెర్రి బాలలం
గమ్యం ఎరుగని జీవన యాణికులం
పూట గడవాలని యోచించే యాచకులం
ఆకలి కేకలు చల్లార్చుకునే చిన్న పిల్లలం
రేపటి రాకకై ఆశించని అమాయకులం
వీధి బాలలం మేం వీధి బాలలం
పొట్టను చేత పట్టి ఒకటైన కుటింబీకులం
భరత మాత వీధిలో నిదురిస్తున్న వీధి బాలలం
మేమే ఆ భావి పౌరులం.
Thursday, July 15, 2010
నా నీలి మేఘమా!
క్షణ క్షణం నన్ను కవ్వించి మరిపించే నా ప్రియ శ్యామమా!
నను వీడిపోతానని విడిచి ఉండలేని నా నీలి మేఘమా!
నేను మాత్రం నిన్ను విడిచి ఉండగలనా ప్రాణమా?
నిగ్రహం నిలవలేని మన అనుబంధంలో
విరహం వచ్చి వేదిస్తున్నది,
దూరం అయ్యే కొద్దీ నీకు మరింత
దగ్గరయ్యేలా నను తరుముతున్నది.
ఇది స్నేహమో లేక ప్రణయమో తెలియని
సంఘర్షణను మిగుల్చుతున్నది.
Subscribe to:
Posts (Atom)